Gold rates: బంగారం ధరలు తగ్గదుల..పెరిగి వెండి...! 1 y ago
8K News-07/03/2025 వరుసగా రెండవ రోజు బంగారం ధరలు తగ్గాయి. పండగలు లేకపోవడంతో కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. ఇది ధరలపై ప్రభావం చూపుతోంది. ఇవాళ (శుక్రవారం) 10 గ్రాములపై రూ.300 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,160 వద్ద పలుకుతోంది. ఇక వెండి ధర రూ.1,100 పెరిగి కేజీ రూ.1,08,100గా ఉంది.